శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (09:52 IST)

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు.

కాగా చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. నోముల మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

30 సంవత్సరాలకు పైగా రాజకీయ, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక తను చాటి చెప్పే వాగ్దాటితో బహుజనం బాగు కోసం పాటు పడాలని నిరంతరం తపించిన బలహీన వర్గాల పెన్నిది.
 
1987 లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ కేంద్ర మండలం అధ్యక్షుడుగా ప్రజాప్రతినిధి ప్రస్థానం తొలి అడుగు వేసిన నోముల మరో పర్యాయం అదే స్థానంలో అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 
 
1999 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మార్క్సిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతు ఎత్తి నినదించిన ధీశాలీ. 
 
తిరిగి మూడో పర్యాయం 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజక వర్గ నుంచి విజయం సాధించి ప్రస్తుతం శాసన సభ్యుడుగా కొనసాగు తున్నారు. 
 
సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయిన ఆయన ఎందరికో తన వంతు స్పూర్తితో కూడిన సందేశాలను ఇచ్చిన ధ్రువతార మరణం దివికేగింది.