1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (14:14 IST)

రాష్ట్ర విభజనపై ప్రధాని తప్పుచేశారు.. కె. కేశవరావు ఫైర్

రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. రాష్ట్ర విభజన బిల్లుకు బీజేపీ కూడా సపోర్ట్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ విస్మరించారని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు విమర్శించారు. 
 
విభజన సమయంలో ఆంధ్రా ఎంపీలు గడబిడ చేయడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయన్నారు. పార్లమెంట్ వ్యవహారాల్లో బిల్ పాస్ చేసే సమయంలో అనుసరించాల్సిన విషయాలు రూల్ బుక్‌లో స్పష్టంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 
 
రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ అసందర్భంగా మాట్లాడి తప్పు చేశారన్నారు. జార్ఖండ్ బిల్ పాస్ చేసే సమయంలో సైతం గొడవలు జరిగాయని.. ఎంపీ ఆనంద్ మోహన్ చేయి విరిగిందని కేశవరావు గుర్తుచేశారు. 
 
ప్రధాని వాఖ్యలు ఖoడించడానికి మాటలు సరిపోవటం లేదని.. ప్రధానిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంపై న్యాయ సలహా తీసుకుంటామని కేకే తెలిపారు.
 
పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను ప్రధాని మోదీ మంట కలిపేలా మాట్లాడారని ఆరోపించారు. పార్లమెంట్ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం సైతం ఉండదని.. పార్లమెంట్‌లో బిల్లు పాసింగ్ మాత్రమే ఉంటుందన్నారు. సైంటిఫిక్, అన్ సైంటిఫిక్ అంటూ ఏం ఉండదని పేర్కొన్నారు.