శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:37 IST)

పట్టపగలే గొడ్డళ్లతో టీఆర్ఎస్ కౌన్సిలర్‌ను నరికి చంపేశారు..

murder
టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్య గురయ్యాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని ప‌త్తిపాక వ‌ద్ద దుండ‌గులు గొడ్డ‌ళ్ల‌తో న‌రికిచంపారు.  అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజ‌న కౌన్సిల‌ర్‌ను సిటీ న‌డిబొడ్డున హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  
 
వివరాల్లోకి వెళితే.. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిల‌ర్‌గా బానోత్ ర‌వినాయ‌క్ వ్యవహరించారు. ప్రస్తుతం బానోత్ రవినాయక్ హత్యకు గురైన ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ‌లో లొంగిపోయారు.