గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: సోమవారం, 22 మే 2017 (17:12 IST)

కెసిఆర్ ఇలా చేస్తాడనుకోలేదు... ఏం చేశాడు...?!

తెలంగాణ రాష్ట్రం. ఆర్ధికంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కావాల్సినంత నిధులును రాష్ట్రం. అందులోను కొత్త రాష్ట్రం... కొత్త ప్రభుత్వం.. కొత్త ముఖ్యమంత్రి.. కొత్త పాలన. దేశ ప్రజలు ఈ కొత్త రాష్ట్రంలో ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనుకున్న విధం

తెలంగాణ రాష్ట్రం. ఆర్ధికంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కావాల్సినంత నిధులును రాష్ట్రం. అందులోను కొత్త రాష్ట్రం... కొత్త ప్రభుత్వం.. కొత్త ముఖ్యమంత్రి.. కొత్త పాలన. దేశ ప్రజలు ఈ కొత్త రాష్ట్రంలో ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనుకున్న విధంగా పెద్దగా ఏమీ జరుగలేదు కానీ.. అక్కడక్కడా అభివృద్ధి మాత్రం జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే కుటుంబం ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఆ కుటుంబం ఎంతో మనస్సున్న కుటుంబమని నిరూపించుకుంది.  
 
తన దగ్గర పనిచేసే వారిని తక్కువగా చిన్నచూపు చూసే సిఎంలను చూశాం. కానీ ఇలా తన కింద పని చేసే ఒక వంట మనిషి సతీష్‌ పెళ్ళికి హాజరవడమే కాకుండా అతన్ని గుండెలకు హత్తుకున్నారు సిఎం కెసిఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండేరు సతీష్‌ చాలాకాలంగా కెసీఆర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. 
 
ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన శిరీషతో పెళ్ళి నిశ్చమయైంది సతీష్‌కు. అతని ఆర్థిక స్థోమత సరిగా లేదని తెలుసుకున్న కెసిఆర్, ఆయన సతీమణి శోభ దగ్గరుండి వివాహం చేశారు. ఈ వివాహానికి ఎంపి కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. వివాహానికి హాజరైన పెళ్ళికుమారుడు, పెళ్ళికుమార్తె బంధువులు కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.