శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (10:00 IST)

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం నెలకొంది. ఈమె తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తమ సొంతూరైన పాలమూరు జిల్లా కురవి మండలం పెద్ద తండాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం జాతర నుంచి సొంతూరుకు బయలుదేరి వెళ్లారు. 
 
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం జాతరలో మంత్రి సత్యవతి రాథోడ్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతర ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే ఆమె మేడారంలో ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వచ్చారు. 
 
గత వారం నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో తండ్రి మరణవార్త విన్న ఆమె హుటాహుటిన సొంతూరుకు వెళ్లింది. జాతరకు ముందు రోజు కూడా ఇలా జరగడంతో మంత్రి ఇంటి తీవ్ర విషాదం అలుముకుంది.