బీజేపీకి తుల ఉమ రాజీనామా- వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి..?
Tula Uma
బీజేపీ అప్పగించిన ప్రతి పనిని విజయవంతం చేసేందుకు కృషి చేశానన్నారు తుల ఉమ. తన సేవను గుర్తించి వేములవాడ టికెట్ ఇచ్చారని, అయితే చివరి నిమిషంలో బీఫాం మరొకరికి ఇచ్చి తనను అవమానించారని లేఖలో పేర్కొన్నారు.
ఓ ఉద్యమకారురాలిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సేవ చేసుకునే భాగ్యం తనకు లభించిందన్నారు.
ఈ ప్రాంత ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే టికెట్లు తెంపలేవన్నారు తుల ఉమ. కార్యకర్తలు, అనుచరులు, ప్రజల అభిప్రాయం మేరకు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.