శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 మే 2022 (18:51 IST)

బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆదుకుంటారని వెళితే పుర్రె పైభాగాన్ని లేపేశారు, ఆరోగ్యశ్రీ కోసం ఆరాటపడ్డారు...

doctor
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తన తండ్రిని బతికించాలంటూ అతడి కుమారుడు పరుగుపరుగున ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆరోగ్యశ్రీ వున్నదా అని అడిగారు. అతడు కార్డ్ తీసి చూపించాడు. అంతే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. పుర్రె పైభాగాన్ని వేరు చేసారు. తిరిగి అతికించడం చేతకాలేదు.

 
మరోవైపు పేషంట్ పరిస్థితి విషమంగా మారింది. ఇలాగే వదిలేస్తే ఆసుపత్రిలో ఎక్కడ ప్రాణం పోతుందో... చేసిన తప్పు ఎలా బయటపడుతుందో ఎలా తప్పించుకోవాలోనన్న ప్రణాళిక వేసి చకాచకా చేసేసారు. చావుబతుకుల మధ్య వున్న రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని ప్రభుత్వాసుపత్రికి తరలించేసారు. ఐతే పుర్రె పైభాగం మాత్రం ఆసుపత్రిలోనే మర్చిపోయి ఉంచేసుకున్నారు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రోగికి శస్త్ర చికిత్స చేసి తల పైభాగం వేరు చేసారు. ఐతే ఆపరేషన్ తర్వాత అతడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆరోగ్యశ్రీ సిబ్బందితో కుమ్మక్కై రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు.


ఐతే తప్పు చేసేవాడు దొరికిపోతాడని చెప్పినట్లే... రిపోర్టులో రోగిని మే 18ని చేర్పించినట్లు, చికిత్స మే 15న చేసినట్లు రాసారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.