గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (14:47 IST)

తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

Rains
శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. దీని ప్రకారం ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లే. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. 
 
అందువల్ల ఈ జిల్లాల్లో ప్రజలు ఇవాళ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. అలాగే వర్షం పడేటప్పుడు చెట్ల కిందకు అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. దీంతో శనివారం తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ చేశారు.