గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (11:26 IST)

రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు.. రెండో బిడ్డకు తల్లి కాబోతున్న ప్రణీత!

Actress Pranitha
Actress Pranitha
అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ నటి ప్రణీత రెండోసారి తల్లి కాబోతోంది. తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రణిత 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. జూన్ 2022లో ఆమె తన కుమార్తెకు జన్మనిచ్చింది. 
 
ప్రస్తుతం ఈ దంపతులు రెండో బిడ్డ కోసం వేచి చేస్తున్నారు. సోషల్ మీడియాలో "రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు!" ఆ తర్వాత తన కూతురు కనిపించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప్రణీత "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్లతో సహా అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. బెంగుళూరుకు చెందిన ఈ నటి తన వివాహమైనప్పటి నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా వుంది.