మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (17:19 IST)

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

Naga Chaitanya, Sobhita
Naga Chaitanya, Sobhita
టాలీవుడ్ సెలెబ్రిటీలు నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న చేసుకోబోతున్నారు. ఈ వివాహం కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగనుంది.
 
ఈ వివాహ వేడుకకు సంబంధించిన వేడుకలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఏజ్ గ్యాప్ గురించి చర్చ సాగుతోంది. చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని, అతని కాబోయే భార్య జైనాబ్ రావ్‌జీ మధ్య తొమ్మిదేళ్ల గ్యాప్ మాదిరిగానే, అభిమానులు చై మరియు శోభిత వయస్సు వ్యత్యాసం గురించి చర్చించుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగా నవంబర్ 23, 1986లో జన్మించిన నాగ చైతన్యకు ఇటీవలే 38 ఏళ్లు కాగా, 1992 మే 31న జన్మించిన శోభితా ధూళిపాళకు 32 ఏళ్లు. వీరికి 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది.
 
ఇకపోతే.. నాగచైతన్య-శోభిత పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం అన్నపూర్ణ స్డూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. దివంగత ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో చై మూడుముళ్లు వేయనున్నారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి దగ్గుబాటి, మెగా, నందమూరి ఫ్యామిలీలలోని అందరూ ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు.