బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 10 ఆగస్టు 2020 (21:47 IST)

బన్నీ మూవీకి బాలీవుడ్‌లో సీక్వెల్

బన్నీ మూవీకి బాలీవుడ్ లో సీక్వెల్ చేయడం ఏంటి..? ఇదేదో గాసిప్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇంతకీ విషయం ఏంటంటే... స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందిన సినిమా పరుగు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేసారు.
 
బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్లో సక్సెస్ సాధించిన పరుగు మూవీ బాలీవుడ్లో కూడా సక్సెస్ సాధించింది. 
 
ఈ సినిమాకి ఇప్పుడు బాలీవుడ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీలో బన్నీ గెస్ట్ రోల్ చేస్తే.. బాగుంటుందని ఆ మూవీ మేకర్ సాజిద్ డైరెక్టుగా బన్నీని అప్రోచ్ అయ్యారని టాక్.
 
బన్నీ గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెబుతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదిలా ఉంటే.. నిర్మాత దిల్ రాజు కూడా పరుగు సినిమాకి సీక్వెల్ నిర్మించాలనుకుంటున్నాడట. మరి.. బొమ్మరిల్లు భాస్కర్ పరుగు సీక్వెల్‌కి ఓకే చెబుతారా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.