వివాదాల సేతుపతి, ఈసారి గంధపు చెక్కల స్మగ్లర్ బయోపిక్ పైన...
వివాదాలకు కారణం విజయ్ సేతుపతి కాకపోయినా ఇప్పుడు అతడు వివాదాలకు కేంద్ర బిందువేమో అని చెప్పాల్సివస్తోంది. ఎందుకంటే అతడు వరుసగా ప్రకటిస్తున్న స్టేట్‌మెంట్లు అలాంటివి మరి. మొన్ననే 800 వికెట్ల వీరుడు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ని ప్రకటించి అనూహ్యంగా ఆ సినిమా నుంచి వైదొలగినట్టు ప్రకటించి హీట్ పెంచిన విజయ్ సేతుపతి ఇంతలోనే మరో ఆసక్తికర బయోపిక్‌కి సంతకం చేశారన్న వార్తలు అంతర్జాలంలో మంటలు పెట్టేస్తున్నాయి.
ఎల్టీటీఈ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది (ముద్ర వేయబడ్డారు) వేలుపిళ్లై ప్రభాకరన్‌గా సేతుపతి నటిస్తున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ప్రభాకరన్ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ కోసం ప్రధాన పాత్ర పోషించడానికి విజయ్ సేతుపతితో మేకర్స్ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా, అలాగే రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా రూపొందించిన చిత్రాలతో పాపులర్ బయోపిక్ డైరెక్టర్‌గా పేరుగాంచిన ఎఎంఆర్ రమేశ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం.
ప్రముఖ రాజకీయ నాయకులపై సినిమాలకు దర్శకత్వం వహించిన పేరున్న దర్శకుడు ఎ.ఎం.ఆర్ రమేశ్ బరిలో దిగడంతో ప్రభాకరన్ బయోపిక్ ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టిటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ జీవితం ఓపెన్ బుక్ లాంటిది. దర్శకుడు రమేశ్ ఇప్పటికే ప్రభాకరన్ పాత్రలో నటించాల్సిందిగా సేతుపతితో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
800 మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన తరువాత సేతుపతిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసినదే. ఈ చిత్రం నుంచి వైదొలగాలని పలువురు ప్రముఖులు విజయ్ సేతుపతిని అభ్యర్థించారు. ఇంతలోనే ప్రభాకరన్ బయోపిక్ గురించి ఈ వార్తపై ఇంకెంతమంది ప్రముఖులు స్పందిస్తారో, ఈ వివాదం ముసురుకుంటోందనన్న ఆందోళన కూడా ఈ మేకర్స్‌లో లేకపోలేదు.