గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 20 నవంబరు 2020 (15:13 IST)

చిరు ఆఫర్‌కి హరీష్ శంకర్ నో చెప్పాడా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. అయితే... ఈ సినిమాకి ముందుగా డైరెక్టర్ సుకుమార్‌ని అనుకున్నారు. సుకుమార్ చేసిన మార్పులు నచ్చకపోవడంతో సుకుమార్ ప్లేస్‌లో సాహో డైరెక్టర్ సుజిత్ వచ్చాడు.
 
సుజిత్ చేసిన మార్పులుచేర్పులు కూడా చిరంజీవికి నచ్చలేదు. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ వినాయక్ రంగంలోకి వచ్చారు. వినాయక్ చేసిన మార్పులు కూడా చిరంజీవికి నచ్చలేదు.
 
 దీంతో ఇప్పుడు చిరు చూపు హరీష్ శంకర్ పైన పడిందని తెలిసింది. ఇప్పటికే పలు రీమేక్‌లను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఈ సినిమాకు న్యాయం చేయగలడని తెలుగు నేటివిటికీ తన ఇమేజ్‌కు అనుగుణంగా మార్చగలడని చిరంజీవి భావించారట. దీని కోసం ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఇప్పటికే హరీష్ తో చర్చలు కూడా జరిపారట. 
 
అయితే... హరీష్ శంకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. కారణం ఏంటంటే... హరీష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజ్ చేసారు.
 
 ఇటీవల పవన్‌ని కలిసిన హరీష్ శంకర్ కలిసారట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో క్రిష్ సినిమాతో పాటు ప్యారలల్‌గా ఈ సినిమాని కూడా కంప్లీట్ చేద్దామని పవన్ మాటిచ్చారట. అందుచేత పవన్‌తో చేయనున్న సినిమాపై వర్క్ చేస్తున్నందున లూసీఫర్ రీమేక్ డైరెక్ట్ చేయలేనని చెప్పేసాడట. అదీ.. సంగతి.