ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (09:42 IST)

ఎన్‌.టి.ఆర్‌. సినిమాకు విలన్‌ ఎవరో తెలుసా!

siva-ntr
siva-ntr
తెలుగు సినిమా పాన్‌ ఇండియాగా మారిపోయింది. అందుకే పెద్ద హీరోల సినిమాలకు కాస్టింగ్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నారు. అన్ని భాషల్లో నటీనటులను తీసుకుని మార్కెటింగ్‌ చేసుకు ప్రక్రియ వచ్చేసింది. చిరంజీవి సినిమాకు సంజయ్‌దత్‌ను తీసుకున్నట్లే తాజాగా కొరటాల శివ సినిమాకు ఎన్‌.టి.ఆర్‌. నటించే సినిమాలో సంజయ్‌దత్‌ను విలన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎందుకనే అది వర్కవుట్‌ కాలేదని తెలిసింది.
 
తాజా సమాచారం ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ను తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు ముంబై వెళ్ళి కొరటాల టీమ్‌ కలవనున్నట్లు తెలిసింది. అది ఓకే గనుక అయితే సైఫ్‌ ఎన్‌.టి.ఆర్‌.సినిమాలో విలన్‌గా వుంటాడు. ఇప్పటికే బాలీవుడ్‌, కోలీవుడ్‌ విలన్లు తెలుగులో రాజ్యమేలుతున్నారు. కొరటాల శివ, ఎన్‌.టి.ఆర్‌. సినిమా అంటే మార్కెట్‌ పరంగా పెద్ద క్రేజ్‌ వుంది. దీన్ని దృష్టిలో వుంచుకుని నిర్మాతలు పెద్ద కాస్టింగ్‌లో సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలో అన్ని వివరాలు తెలియనున్నాయి.