సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (18:10 IST)

మహేష్ బాబు- రాజమౌళి చిత్రంలో ఇండోనేషియా నటి?

Chelsea Islan
Chelsea Islan
టాలీవుడ్ మహేష్ బాబు రాబోయే ప్రాజెక్ట్ కోసం బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎస్ఎస్ రాజమౌళితో జతకట్టడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఇక ఈ సినిమా గురించి రోజుకో గాసిప్ బయటకు వస్తుంది. మహేష్ బాబు నటిస్తున్న చిత్రం కోసం రాజమౌళి ఇండోనేషియా నటిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఒలివియా మోరిస్‌ను ఇప్పటికే హైలైట్ చేసిన రాజమౌళి ఇప్పుడు తన తదుపరి చిత్రానికి ఇండోనేషియా నటిని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. 
 
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా మార్కెట్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడనడంలో సందేహం లేదు. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఇంటర్నేషనల్ ట్రిప్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 
 
టాలీవుడ్ ప్రిన్స్ 
 
మహేష్ కెరీర్‌లో 29వ చిత్రంలో హాలీవుడ్ నటీనటులు కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇండోనేషియా హీరోయిన్‌ను ఎంపిక చేశారనీ, ఆమె చెల్సియా ఇస్లాన్ అనే వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 
 
తాజాగా రాజమౌళి ఆమెకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశాడు. మహేష్ బాబు, రాజమౌళి సినిమాల్లో చెల్సియా ఇస్లాన్ పని చేస్తుందని ధృవీకరించబడింది.
 
 మరోవైపు, మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.