సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (12:23 IST)

నయనతార షాకింగ్ నిర్ణయం.. ఏంటది?

nayanatara_vignesh
లేడీ సూపర్ స్టార్ నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కారణంగా నయన్ ఇక నటనకు స్వస్తి చెప్పబోతోంది. గతంలో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి నటనకి గుడ్ బై చెప్పనుందని టాక్ నడుస్తోంది. ఆపై సమయాన్ని భర్తతో కేటాయించాలని నయనతార భావిస్తోందట.
 
ఐతే, నయనతార నిర్ణయంపై ఫ్యాన్స్ తెగ అందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె.. చిరు 'గాడ్ ఫాదర్' షారూఖ్ 'జవాన్', పృథ్వీరాజ్ 'గోల్డ్' సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ సినిమాల తర్వాత నిజంగానే నయనతార సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుందా ? లేదా ? అనేది చూడాలి. 
 
ఇక నయనతార ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి నయనతార అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంది.
 
ఇప్పటికే చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇళ్లు వేద నిలయానికి సమీపంలోనే నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేయడం విశేషం.