గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (15:30 IST)

గీతూపై ఓ రేంజ్‌లో ఫైరవుతున్న షణ్ముఖ్ ఫ్యాన్స్...

geetu
సోషల్ మీడియా ద్వారా అనేక మంది సినీ నటీనటులు రాత్రికి రాత్రి సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. తమ ప్రతిభను ఈ వేదిక ద్వారా చాటుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు. అలాంటివారిలో షణ్ముఖ్, గీతూ ఒకరు. అయితే, ఇటీవల గీతూపై షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. 
 
ఇటీవల గీతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నేను చిన్నానిటి నుంచి బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నాను. ఇంట్లో వాళ్లు కూడా బాడీ షేమింగ్ చేశారు. అయితే, ఇటీవల తన కజిన్ ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ముందు తన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలని సలహా ఇచ్చాు. నేనేమో పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. ఇతరులు మీ శరీరం గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. మనుషులు చూపులను బట్టి వారిని అంచా వేయకండి. దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు అంటూ బోరున విలపించింది. ఇంతవరకు అంతా బాగానే వుంది.
 
నిజానికి గతంలో షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో ఉన్నపుడు ఇదే గీతూ బాడీ షేమింగ్ గురించి మాట్లాడినట్టు సమాచారం. దీన్ని షణ్ముఖ్ ఫ్యాన్స్ ఇపుడు గుర్తుచేస్తున్నారు. గతంలో షణ్ముఖ్‌ను టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్ చేసినపుడు ఏమైంది? నీకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై గీతూ స్పందించారు.