గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (22:03 IST)

తల్లిదండ్రులు కాబోతున్న నయనతార - విఘ్నేష్ జంట?

నయనతార - విఘ్నేష్ జంట గురించే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యిందని.. త్వరలో వివాహం జరిగిందని టాక్ వస్తోంది.
 
అయితే ఇటీవలే ఒక గుడిలో నయన్ నుదుటిన బొట్టుతో కనిపించడంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించకపోవడంతో వీరి పెళ్లి వార్తలు నిజమే అని అందరు ఫిక్స్ అయిపోయారు.
 
తాజాగా నయన్ గురించి మరో షాకింగ్ వార్త కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం నయన్- విఘ్నేష్ జంట తల్లిదండ్రులు కావాలని ఆరాటపడుతున్నారట. అది కూడా సరోగసీ ద్వారా నయన్ తల్లి కావాలనుకుంటున్నదట. 
 
ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్‌లో ఈ పద్దతి సర్వ సాధారణం అయిపోయింది. ఇటీవలే ప్రియాంక- నిక్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులుగా మారిన సంగతి తెల్సిందే. ఇక అదే పంథాలో ఈ జంట కూడా పేరెంట్స్ కావాలని ఆశపడుతున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.