శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (14:27 IST)

సంక్రాంతికి రాలేనంటున్న 'వకీల్ సాబ్'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". "అజ్ఞాతవాసి" చిత్రం తర్వాత ఆయన తిరిగి ముఖానికి రంగు వేసుకోవడం ఈ చిత్రంతోనే ప్రారంభం. బాలీవుడ్ చిత్రం "పింక్‌"కు ఈ చిత్రం రీమేక్. 'పింక్‌'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా సంక్రాంతికి వాయిదా వేశారు. అయితే, కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించక పోవడంతో ఈ చిత్రం షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 
 
పైగా, లాక్‌డౌన్ తీసేసినప్పటికీ జనంలో భయంపోయి మునుపటిలా థియేటర్స్‌కి రావడానికి  చాలా సమయమే పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల 'వకీల్ సాబ్' షూటింగు పూర్తయినప్పటికీ, నిర్మాత 'దిల్' రాజు ఇప్పట్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన చేయడం లేదట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఆ సమయంలో పెద్ద సినిమాలు రంగంలో వుంటే, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెబుతున్నారు.