ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (21:25 IST)

పోసానిని అరెస్టు చేస్తున్నారట, ఎందుకంటే?

పోసాని క్రిష్ణమురళి ఈమధ్య పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్సలు చేయడం ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం నచ్చకపోవడం ఈ మొత్తం సీన్ జరిగింది.
 
అసలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా పోసాని ప్రెస్ మీట్ పెట్టిన తరువాత ఆయన్ను అడ్డుకునేందుకు పవన్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఇది కాస్త పెద్ద రచ్చ అయ్యింది. ఒక పంజాబీ అమ్మాయిని పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేశారని.. ఆమెకు కడుపు చేశారని.. 5 కోట్లు డబ్బులు కూడా ఇచ్చారని పోసాని చెప్పారు.
 
దీనిపై నాగబాబు, చిరంజీవి కూడా స్పందించాలని సవాల్ విసిరారు. ఎపిని అన్ని విధాలుగా జగన్ అభివృద్థి చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్సిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్సలు, ఆరోపణలు చేశారు. ఇది కాస్త పవర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పించింది.
 
ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ సత్తెనపల్లిలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిని వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. జనసైనికుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు పోసాని విచారణకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే జనసైనికులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆశక్తికరంగా మారుతోంది.