మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By కుమార్ దళవాయి
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (21:45 IST)

అఖిల్‌తో 'టాక్సీవాలా' భామ

టాక్సీవాలా సినిమా హిట్ కావడంతో హీరోయిన్ ప్రియాంక జావల్కర్‌కు అవకాశాలు వస్తాయని ఆశించింది. అయినా కూడా పెద్దగా అవకాశాలేవీ రాకపోవడంతో నిరాశ చెందింది. అయితే ఈమధ్య కాలంలో ప్రియాంక జావల్కర్ గురించి ఒక కొత్త వార్త బయటికి వచ్చింది.
 
అఖిల్ తదుపరి సినిమాలో ప్రియాంకానే హీరోయిన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంకను ఎంచుకుని, ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇదే నిజమైతే ప్రియాంకాకు అదృష్టం వరించినట్లే.
 
అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఈ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చి, సినిమా హిట్ అయితే కనుక ప్రియాంకాకు అవకాశాలు వెల్లువెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి.