శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2019 (18:13 IST)

తమిళ సినిమాలనే నమ్ముకుంటానంటున్న చెర్రీ, ఎందుకంటే?

తెలుగు కథను సినిమాగా తీసి ఆ సినిమా హిట్ సాధించడం కాస్త కష్టంతో కూడుకున్న పని అనుకుంటున్నాడేమో రామ్ చరణ్. అందుకే తమిళ పరిశ్రమలో హిట్ అయిన సినిమాలనే ఆధారంగా చేసుకుని సినిమాలను చేయాలనుకుంటున్నారు చెర్రీ.
 
ఇప్పటికే రామ్ చరణ్ కొన్ని సినిమాలకు ప్లాన్ చేసుకున్నాడట. అందులో మొదటి సినిమా అసురన్. ధనుష్ తమిళంలో నటించిన అసురన్ భారీ విజయాన్ని సాధించింది. అభిమానుల్లో ఆ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. దీంతో రామ్ చరణ్ ఆ కథతోనే తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నారట.
 
అది కూడా తన సొంత బ్యానర్. తానే నిర్మాతగా మారి సినిమా చేసేందుకు రామ్ చరణ్ సిద్థమయ్యారట. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని రామ్ చరణ్ కోరుకుంటున్నాడట. అసురన్ సినిమా కథ రామ్ చరణ్‌‌కు బాగా నచ్చిందట. తన అభిమానులను ఆ సినిమా బాగా ఆకట్టుకుంటుందని, ఆ పక్కా మాస్ క్యారెక్టర్ తనకు సరిగ్గా సరిపోతుందంటున్నాడు చెర్రీ. మరి చూడాలి తమిళ కథను నమ్ముకున్న చెర్రీకి అదృష్టం ఏ విధంగా వరిస్తుందో?