గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (10:51 IST)

టార్చ్‌లైట్‌కు హీరోయిన్లు నో చెప్పారట.. సదా ధైర్యంగా..?

నిన్నటితరం కథానాయికల్లో సదా ఒకరు. తెలుగులో జయం సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సదా కొన్ని సినిమాలే చేసినా.. హీరోయిన్‌గా ఆమెకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. కానీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఆమె

నిన్నటితరం కథానాయికల్లో సదా ఒకరు. తెలుగులో జయం సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సదా కొన్ని సినిమాలే చేసినా.. హీరోయిన్‌గా ఆమెకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. కానీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఆమె నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం సదా తమిళంలో ఓ సినిమాలో కనిపించనుంది. ''టార్చ్‌లైట్'' అనే సినిమా చేసేందుకు సదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో సదా కనిపించనుంది. ఈ చిత్రానికి మజీద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో సదా కనిపించనుంది. వేశ్య జీవితానికి సంబంధించిన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందట. 
 
ఈ రోల్‌లో నటించేందుకు చాలామంది హీరోయిన్లు ముందుకు రాలేదట. కానీ సదా ధైర్యంగా ఈ రోల్ చేసేందుకు ముందుకొచ్చిందని టాక్. ఈ సినిమాలోని పాత్రలను దర్శకుడు మజీద్ మలిచిన తీరు సదాకి బాగా నచ్చేయడంతో ఆ చిత్రం చేసేందుకు ఆమె రెడీగా వున్నట్లు చెప్పిందట.