శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (20:10 IST)

రణబీర్ కపూర్‌‌తో సాయిపల్లవి.. కెమిస్ట్రీ అదిరిపోతుందా?

Sai Pallavi
ఫిదా భామ సాయిపల్లవికి బంపర్ ఆఫర్ వచ్చేసింది. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో నటించే సాయిపల్లవి.. రణ్‌బీర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మధు మంతెన తదుపరి రామాయణంలో సాయిపల్లవి, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2023లో ప్రారంభం కానుంది. 
 
ఇందులో సీతాదేవి పాత్రలో నటించేందుకు సాయిపల్లవి ఎంపికైనట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మధు మంతెన రామాయణంపై విపరీతమైన అంచనాలున్నాయి.  
 
కాగా టాలీవుడ్‌లో, సాయి పల్లవి చివరిసారిగా మహిళా సెంట్రిక్ మూవీ గార్గిలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన సాయి పల్లవి సొంతంగా హాస్పిటల్ నిర్మించుకోవడంపై దృష్టిపెట్టిందని తెలుస్తోంది.