గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (14:01 IST)

మూడోసారిగా ముచ్చటగా శ్రీజ పెళ్లి.. చిన్ననాటి స్నేహితుడితో డుం.. డుం.. డుం..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రెండో పెళ్లి కూడా విడాకుల వరకు వెళ్లిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
 
కాగా ఇప్పుడు తాజాగా శ్రీజకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. అదే శ్రీజ మూడో పెళ్లి. అయితే ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ బిడ్డను కన్న శ్రీజ.. ఆ తరువాత అతనితో విడాకులు తీసుకుని కళ్యాణ్ దేవ్‌ను పెళ్లాడింది.
 
కానీ మనస్పర్థలతో ఈ పెళ్లి కూడా పెటాకులు అయినట్లు ప్రచారం జరుగుతోంది. తన క్లోజ్ ఫ్రెండ్‌తో శ్రీజ మళ్లీ ప్రేమలో పడిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతోందని టాక్.
 
కాగా ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడాకుల గురించి గానీ, మూడో పెళ్లి ముచ్చట గురించి గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
ఇకపోతే.. శ్రీజ అతి త్వరలోనే తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది..ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండి శ్రీజపై సోషల్ మీడియాలో అభిమానుల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది.