మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 10 నవంబరు 2017 (19:37 IST)

చెర్రీపై కోపమొస్తే వెంటనే అది చూసేస్తా... ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కుమారుడి కంటే కూడా తెలుగు సినీ పరిశ్రమలో రామ్ చరణ్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపే ఉంది. కొత్తకొత్త గెటప్‌లలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా మంచి కథను ఎంచుకుని సినిమాల్లో నటిస్తారు చెర్రీ. ఎప్పుడూ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండే చ

మెగాస్టార్ చిరంజీవి కుమారుడి కంటే కూడా తెలుగు సినీ పరిశ్రమలో రామ్ చరణ్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపే ఉంది. కొత్తకొత్త గెటప్‌లలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా మంచి కథను ఎంచుకుని సినిమాల్లో నటిస్తారు చెర్రీ. ఎప్పుడూ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండే చెర్రీ ఇంటికి వెళ్ళిన వెంటనే రిలాక్స్ కోసం చూస్తుంటాడు. అలాంటి సమయంలో ఆయన భార్య ఉపాసన బయటకు వెళదామని కోరడం గాని, లేకుంటే ఏదైనా విసుగు తెప్పించే విషయాలను చెబితే మాత్రం వెంటనే డిసప్పాయింట్‌మెంట్ అయిపోతాడట చెర్రీ. 
 
ఉపాసనను గట్టిగా అరిచి వెళ్ళిపోతూ ఉంటాడట. అయితే అలాంటి సమయంలో తను కోప్పడకుండా, విసుక్కోకుండా కోపం తగ్గించుకునేందుకు నేరుగా తమ బెడ్ రూంలోకి వెళ్ళి చెర్రీ చిన్ననాటి ఆల్బమ్‌ను చూస్తారట ఉపాసన. అది కూడా క్యూట్‌గా ఉండే ఫోటోను చూస్తారట. అప్పుడే తన మనస్సుకు ప్రశాంతతతో పాటు చెర్రీ పైన కోపం తగ్గిపోతోందంటోంది ఉపాసన. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కూడా చేసేశారు.