ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (12:52 IST)

జూన్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం?

Varun Tej, Lavanya Tripathi
Varun Tej, Lavanya Tripathi
టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. 
 
ఇందులో భాగంగా నిశ్చితార్థం జూన్ 2023లో జరుగుతుందని.. అయితే నిశ్చితార్థం తేదీ ఇంకా ఫిక్స్ కాలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏడాదిలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 
 
మిస్టర్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అప్పటి నుంచి ఈ  పార్టీలలో కూడా కలిసి కనిపిస్తారు. అయితే తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే, నిహారిక వివాహ వేడుకకు లావణ్య హాజరు కావడం పుకార్లకు ఆజ్యం పోసింది.
 
వరుణ్ పెళ్లిపై నిర్ణయం ఆతని చేతుల్లోనే ఉందని వరుణ్ తేజ్ తండ్రి, నటుడు నాగబాబు కూడా గతంలో ప్రకటించారు. వరుణ్ - లావణ్య ఇద్దరి కుటుంబాలు వారి బంధానికి ఆమోదం తెలిపాయని, ఇప్పుడు పెళ్లికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. 
 
త్వరలో నిశ్చితార్థం జరగబోతోందని, వరుణ్, లావణ్యలు కూడా ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.