శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:44 IST)

వెంకీ 75వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 74వ చిత్రం నారప్ప చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే... వెంకీ 75వ చిత్రం గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 
 
అవి ఏంటంటే... వెంకీ 75వ చిత్రాన్ని పూరి డైరెక్షన్లో చేయనున్నారని కొన్ని వార్తలు వస్తే... కాదు కాదు వెంకీ 75వ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్షన్లో చేయనున్నారని మరో వార్త బయటకు వచ్చింది.  తాజాగా వెంకీ 75వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయనున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. 
 
ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇంతమే మేటర్ ఏంటంటే... వెంకటేష్ గారితో 75వ చిత్రాన్ని త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో చేయనున్నారని... ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియచేసారు.