గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (22:47 IST)

వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి ఫిక్స్..

Daggubati Family
Daggubati Family
విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని వివాహానికి సిద్ధమవుతోంది. దీంతో దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. విజయవాడకు చెందిన ఓ వైద్యుడి కుటుంబానికి ఆమె కోడలు కాబోతోంది. విజయవాడలో నిశ్చితార్థ వేడుక జరిగిందని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ "సైంధవ్" సినిమాలో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు.
 
వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జైపూర్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్‌లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
 
కాగా, వెంకటేష్ మూడో కుమార్తె భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ వివాహం కూడా త్వరలోనే జరగనుందనే సంగతి తెలిసిందే.