ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 13 అక్టోబరు 2021 (23:04 IST)

బాబుమోహన్‌ను ఎందుకు ఓడించారో తెలుసా..?

ఎట్టకేలకు మా ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలను కూడా స్వీకరించారు. అయితే తారాస్థాయిలో మాటల యుద్ధం మాత్రం మా అసోసియేషన్లో పోటీ చేసిన వారి మధ్య నడిచింది. ఇదంతా తెలిసిందే. గెలుపు, ఓటముల తరువాత కూడా అదే తారాస్థాయిలో విమర్సలు, ఆరోపణలు చేసుకున్నారు.
 
ఇదంతా పక్కనబెడితే బిజెపి నాయకుడిగా, సీనియర్ నటుడిగా బాబు మోహన్‌కు మంచి పేరుంది. మంచు విష్ణు ప్యానెల్లో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డారు. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్లో శ్రీకాంత్ నిలబడ్డాడు. ఇద్దరిలో శ్రీకాంత్ విజయం సాధించాడు.
 
అసలు మంచు విష్ణుకు ఓటేసిన వాళ్ళు ఎలాగో బాబుమోహన్‌కు ఓటెయ్యాలి. కానీ ఇక్కడ ఓటు శ్రీకాంత్‌కు వేశారు. అందుకు కారణం కులమేనన్న ప్రచారం బాగానే సాగుతోంది. శ్రీకాంత్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు సినీనటుల్లో ఎక్కువగా ఉండడంతో వారు శ్రీకాంత్ వైపే మ్రొగ్గు చూపారన్న ప్రచారం బాగానే సాగుతోంది.
 
ప్రకాష్ రాజ్ ఓటమిపై స్పందించిన బండి సంజయ్ ట్వీట్ కూడా చేశారు. అయితే బాబుమోహన్ విషయంలో మాత్రం ఆయన స్పందించలేదు. ఇదే హాట్ టాపిక్‌గా మారుతోంది. సామాజిక వర్గానికే పెద్దపీట వేసే విధంగా మా సభ్యులు ప్రవర్తించిన తీరు విమర్సలకు తావిస్తోంది.