శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 27 జూన్ 2020 (17:57 IST)

బిత్తిరి సత్తికి ఏమైంది? ఎందుకు ఆయన్ను ఆ ఛానల్ గెంటేసిదంటే?

బిత్తిరి సత్తి. తెలంగాణా యాసలో మాట్లాడినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రతి తెలుగు వ్యక్తికి తెలిసిన వ్యక్తి బిత్తిరి సత్తి. బిత్తరి సత్తి కోసం ప్రత్యేకంగా ఒక స్లాట్ పెట్టిన తెలంగాణా ఛానల్ ఆ తరువాత విపరీతమైన క్రేజ్ ఛానల్‌తో పాటు బిత్తిరి సత్తికి రావడంతో ఇక వెనక్కి తగ్గలేదు. 
 
తెలంగాణాలో ఆ ఛానల్ టాప్ రేటింగ్‌కు వెళ్ళడానికి బిత్తిరిసత్తి చేస్తున్న ఎపిసోడ్ కూడా ఒక కారణం. అయితే ఆ ఛానల్ మొత్తం నడవడానికే తానే కారణమని.. ఛానల్ రేటింగ్ పెరగడానికి తన ఒక్క ఎపిసోడ్ బాగా సహకరిస్తోందని బిత్తిరి సత్తి తన సహచరులకు చెబుతూ వచ్చారు.
 
ఇది కాస్త మేనేజ్మెంట్‌కు తెలియడంతో బిత్తిరి సత్తిని పంపించేశారు. దీంతో మళ్ళీ మరో ఛానల్లో బిత్తిరి సత్తికి అవకాశం లభించింది. ఆ ఛానల్లోను ప్రత్యేక ఎపిసోడ్ చేస్తూ వచ్చారు బిత్తిరి సత్తి. నెలకు ఆయన జీతం అక్షరాలా 4 లక్షలు. ఇదంతా బాగానే ఉంది. కానీ బిత్తిరి సత్తికి గతంలో ఉన్న క్రేజ్ కొత్త ఛానల్లో దక్కలేదు.
 
ఇది కాస్త మేనేజ్మెంట్‌ను ఆలోచింపజేసింది. దాంతో పాటు ఈనెల వచ్చిన ఫాదర్స్ డే సమయంలో బిత్తిరి సత్తి చేసిన ఒక వీడియో కాస్త మేనేజ్మెంట్‌కు కోపం తెప్పించింది. అందులో ఫాదర్స్ డేకి సంబంధించి తన తండ్రి ఫోటోను చూపించారని.. ఒక చిన్న కారణం చూపిస్తూ బిత్తిరిసత్తిని ఆ ఛానల్ నిర్వాహకులు నిర్థాక్షణ్యంగా తొలగించారట. 
 
అయితే బిత్తిరిసత్తి మాత్రం ఏమాత్రం అధైర్యపడలేదట. తనకు ఎవరో ఒకరు అవకాశమిస్తారని.. తను ఖచ్చితంగా మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంటానన్న నమ్మకంతో ఉన్నారట బిత్తిరి సత్తి. ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్నారట బిత్తిరిసత్తి.