శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (16:57 IST)

తిరుపతి దర్శనం ప్రభాస్ ఆదిపురుష్ కు కలిసొస్తుందా ?

Prabhas at tirumala
Prabhas at tirumala
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. బాహుబలి 1,2. ఆ సినిమా వల్ల ప్రపంచ స్టార్ అయిపోయాడు. కానీ ఆ సినిమా ప్రభావం ఆ తర్వాత సినిమాలపై పడింది. దాంతో రెండు సినిమాలు సాహో, రాధే శ్యాం  నిరాశ పరిచాయి. పాన్ ఇండియా సినిమాలుగా తీసిన ఉపయోగం లేదు. అయినా ఆయనకు నాలుగు సినిమాలు వెతుకుంటూ వచ్చాయి. అందులో ఆదిపురుష్ ఒకటి. ఈసినిమా ఆరంభం నుంచే సెట్ కాలిపోవడం, కరోనా వంటి అవరోధాలు వచ్చాయి. దాంతో ప్రభాస్ కు దేవుడి [పై మరింత నమ్మకం వచ్చిందని తెలిసింది.
 
Prabhas at tirumala
Prabhas at tirumala
ఈరోజు ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ తిరుపతి లో జరుగుతుంది. అందుకే ముందుగా చిన్నజియర్ స్వామి ఆశీస్తులతో ప్రభాస్ తిరుపతి దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని కథ తో సినిమా రూపొందింది. అందుకే తిరుపతిలో హోమం కూడా చేయించినట్లు సమాచారం. ఈ సినిమాను టి సిరీస్, ఓం రౌత్ నిర్మించారు. ఇంకా కొందరు ప్రముఖులు కూడా పార్టనర్ గా ఉన్నారని తెలిసింది. సో, ఈ సారైనా తిరుపతి వల్ల ప్రభాస్ కు కలిసొస్తుందో లేదో చూడాలి.