గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:18 IST)

ఆయుష్ శర్మ హీరోగా కాత్యాయన్ శివపురి దర్శకత్వంలో జగపతిబాబు

Aayush Sharma,  Jagapathi Babu
Aayush Sharma, Jagapathi Babu
మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఏమైయింది ఈవేళ, బెంగాల్ టైగర్ లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నిర్మాత కె.కె.రాధామోహన్‌ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఆయుష్ శర్మ కథానాయకుడిగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. కాత్యాయన్ శివపురి దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నారు.
 
ఈ చిత్రంలో తాజాగా వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు చేరారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆయుష్ శర్మ, జగపతి బాబు కలిసివున్న ఫోటోని షేర్ చేశారు మేకర్స్. సుశ్రీ మిశ్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యా మాలవడే, జస్విందర్ గార్డనర్, సంగయ్, రాశుల్ టాండన్ ఇతర ముఖ్య పాత్రలు పోహిస్తున్నారు.
 
విశాల్, తనిష్క్, చెట్టాస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా జి శ్రీనివాస రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. పారిజాత్ పొద్దర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి దినేష్ సుబ్బరాయన్ యాక్షన్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2023 లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
తారాగణం: ఆయుష్ శర్మ, జగపతి బాబు, సుశ్రీ మిశ్రా, విద్యా మాలవడే, జస్విందర్ గార్డనర్, సంగయ్, రాశుల్ టాండన్ తదితరులు