బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (12:58 IST)

విశాల్, సమంతల ''అభిమన్యుడు'' ట్రైలర్

తెలుగు, తమిళ భాషల్లో పందెంకోడి ఫేమ్ విశాల్‌కు మంచి పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ సొంత బ్యానర్‌పై నిర్మితమవుతున్న ''ఇరుంబుతిరై'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విశాల్ సరసన సమంత నటిస్తోంది. ఈ చ

తెలుగు, తమిళ భాషల్లో పందెంకోడి ఫేమ్ విశాల్‌కు మంచి పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ సొంత బ్యానర్‌పై నిర్మితమవుతున్న ''ఇరుంబుతిరై'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విశాల్ సరసన సమంత నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'అభిమన్యుడు' అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ విడుదలైంది. 
 
ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ ఆఫీసరుగా విశాల్ కనిపిస్తున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని.. ప్రజల జీవితాలను కొంతమంది ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ కాలపు దొంగకి ఇంటి తాళాలు అక్కర్లేదని.. చిన్న ఇన్ఫర్మేషన్ చాలునని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. అభిమన్యుడు ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.