శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (16:36 IST)

ప్ర‌ముఖ న‌టి స‌న కొడుకు అన్వర్ పెళ్లి వేడుక..

ప్రముఖ క్యారెక్టర్‌ నటి సన తెలుగు, తమిళంలో దాదాపు 600 సినిమాలకు పైగా నటించిన సంగతి తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా టీవీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. మంగళవారం సన, ఆమె భర్త సయ్యద్‌ సదుద్దీన్‌ మీడియాతో  మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి సయ్యద్‌ అన్వర్‌ వివాహం సమీరా షెరీఫ్‌తో ఈ రోజు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. 
 
మా అబ్బాయి పలు తమిళ సీరియల్స్‌లో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా ఫేమస్‌. అలాగే  మా కోడలు సమీరా షరీఫ్‌ కూడా తెలుగు, తమిళ టీవీ రంగాల్లో బుల్లితెరపై సంచలనం సృష్టించిన అనేక సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇన్‌స్టాలో ‘అన్విరా’ హ్యాండిల్‌తో పోస్టులు పెడుతుంటారు. ఈ పోస్ట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్‌. 
 
సోమవారం రాత్రి వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా జరిగింది. ఎంతో గ్రాండ్‌గా భారీ ఎత్తున చేసుకోవచ్చు. కానీ వారిద్దరికీ ఏ హడావిడి లేకుండా చేసుకోవటమే ఇష్టం. కారణం ఇద్దరూ కలిసి కొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చులకు సహాయపడాలనుకుంటున్నారు. వారిద్దరి నిఖా జరిగిందని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేం ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేశాం’’ అన్నారు.