గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (19:13 IST)

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి హెయిర్ ఆయిల్ ప్రకటన వైరల్

Sneha Reddy
Sneha Reddy
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తాజా ప్రచార ప్రకటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో 8.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొన్నిగంటల క్రితం, స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. 
 
దీనిలో ఆమె సీక్రెట్ హెయిర్ ఆయిల్ నుండి బ్లాక్ చార్మ్ హెయిర్ ఆయిల్‌ను ప్రచారం చేసింది. ఆమె తన లేటెస్ట్ లుక్స్‌లో చాలా అందంగా ఉంది. ఈ యాడ్‌పై నటి శ్రియ తన పోస్ట్‌పై స్పందించి చాలా అందంగా ఉంది అని తెలిపింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.