మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (16:02 IST)

బాల్‌ ఠాక్రే నాకు జీవితాన్నిచ్చారు : అమితాబ్ బచ్చన్ (వీడియో)

శివసేన అధినేత బాల్‌ ఠాక్రేపై బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. బాల్ ఠాక్రే తనకు జీవితాన్ని ఇచ్చారంటూ గుర్తు చేశారు.

శివసేన అధినేత బాల్‌ ఠాక్రేపై బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. బాల్ ఠాక్రే తనకు జీవితాన్ని ఇచ్చారంటూ గుర్తు చేశారు. నిజానికి బాల్‌ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన బయోపిక్ సిరీస్ చిత్రాలైన సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్ 3 చిత్రాల్లో అమితాబ్ హీరోగా నటించిన విషయం తెల్సిందే. 
 
ఇపుడు, ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరో బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. దీనికి 'ఠాక్రే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఠాక్రే పాత్రలో నవాజుద్దీన్‌ సిద్ధిఖి నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను అమితాబ్ రిలీజ్ చేశారు. 
 
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి అమితాబ్‌ బచ్చన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్‌.. తనకు బాల్‌ఠాక్రేతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. బాల్‌ఠాక్రే వల్లనే తాను ఇలా ఉన్నానని, ఆయన నాకు మార్గదర్శి అని కొనియాడారు.