గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (13:45 IST)

అంత‌ర్యామి అల‌సి తీ సొల‌సి తీ అంటూ వెళ్ళిన బాలు గాత్రానికి అప్పుడే ఏడాది వ‌చ్చింది

S.P. Balu songs
`నేనేకొ ప్రేమ‌పిపాసిని.. నా దాహం తీర‌నిది. నీ హృద‌యం క‌ద‌లిది., రా దిగిరా దివినుంచి భువికి దిగిరా.. అంటూ భ‌క్తితోపాడిన గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి. బాల‌సుబ్రహ్యం దివికేగి అప్పుడే నేటితో ఏడాది గ‌డిచింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాట‌ల్లోని మాధుర్యాన్ని ఆయ‌న గాత్రంలోని మ్యాజిక్‌ను ఓసారి గుర్తుచేసుకుందాం.
 
అల‌నాటి న‌లుగురు అగ్ర క‌థానాయ‌కులు ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌., శోభ‌న్‌బాబు, కృష్ణ‌ల నుంచి  త‌ర్వాత త‌రం చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌ల‌కు సైతం త‌న గాత్రంతో వ‌న్నె వెచ్చారు ఎస్‌.పి.బాలు. అంతేకాక ఆ త‌ర్వాత త‌రంకూ పాడిన చ‌రిత్ర ఆయ‌న‌ది. క‌మ‌ల్‌హాస‌న్‌కు ఆయ‌న మాట‌తోపాటు పాట‌ను ఇస్తే క‌మ‌లే పాడాడా! అన్నంత‌గా మైమ‌రిపించేవాడు. అల్లు రామ‌లింగ‌య్యను ఇమిటేట్ చేస్తూ పాడిన పాట ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది. ఇక మొన్న‌టి జె.వి.సోమ‌యాజులుకు పాడితే అచ్చు సోమ‌యాజులు పాడాడా| అన్నంత‌గా మురిపించారు. ఆయ‌న కెరీర్‌లో ఎన్నో పాట‌లు, ఎంద‌రికో స్పూరి దాయ‌కంగా నిలిచారు.
 
1979లో అక్కినేని `ముద్దుల కొడుకు`లో చిట‌ప‌ట చినుకులు., రావ‌ణుడే రాముడైతేలో ర‌వివ‌ర్మ‌.. అంటూ ఆల‌పించిన గాత్రం మురిపించాయి. ఇక దాస‌రి నారాయ‌ణ‌రావు. అక్కినేని కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ `ప్రేమాభిషేకం`లోని పాట‌లు మంత్ర‌ముగ్థుల్ని చేశాయి. `వంద‌నం అభివంద‌నం, కోట‌ప్ప కొండ‌కు వ‌స్తాన‌ని మొక్కుకున్నా.., ఆగ‌దూ ఆగ‌దూ.. ఆగ‌దు ఏ నిముషం నీ కోసమూ.. అంటూ కాల‌మ‌హిమ‌ను తెలియజేసిన ఆయ‌న గాన విల‌క్ష‌ణ‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అదే అక్కినేనికి 91లో `సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు`లో స‌మ‌యానాకి తగు.. అంటూ పాడారు. 
 
ఒక ద‌శ‌లో శోభ‌న్‌బాబు, సాహ‌సానికి మారుపేరైన కృష్ణ ప్రోత్సాహంతో ఎస్..పి.బాబు నిల‌దొక్కుకోగ‌లిగారు. అంత‌కుముందు ఆయ‌న కెరీర్ అంత స‌జావుగా సాగ‌లేదు. అయితే తెలుగులోకంటే క‌న్న‌డ‌లో ఆయ‌న ప‌లు పాట‌లు పాడారు. తాను త‌దుప‌రి జ‌న్మ‌క‌నుక ఎత్తితే క‌న్న‌డ‌లోనే పుట్టాల‌నే విష‌యాన్ని కూడా ప‌లుసార్లు ప్ర‌స్తావించారు కూడా. అలాంటి టైంలో కృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో కెరీర్ మారిపోయింది. 1971లో చెల్లెలి కాపురంలో బాలు త‌న ఉనికిని చాటుకున్నారు. `ఆడ‌వే మ‌యూరి న‌ట‌న‌మాడ‌వే మ‌యూరి.. అంటూ ఆల‌పించారు. 72లో మాన‌వుడు దాన‌వుడులో దేవుడిపై పాడిన `అనువ‌నువున‌దేవా..` పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. శోభ‌న్‌బాబు, శార‌ద‌పై సాగిన పాటలో `పాపాయి న‌వ్వాలి..` అనేది మంచి గుర్తింపు తెచ్చింది. ఇక మంచి మ‌న‌సులులో కె.వి. మ‌హేద‌వ‌న్ అండ‌గా నిలిచారు బాలుకు. గోరింటాకులో `ఇలాగే వ‌చ్చే.. కొమ్మ‌కొమ్మ‌కు స‌న్నాయి., దేవ‌త‌లో `వెల్ల‌వ‌చ్చే గోదార‌మ్మా.. అంటూ ఆల‌పించారు.
 
ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు  బాలు గాత్రం స‌రిగ్గా సూట‌వుతుంద‌నేది ప్రేక్ష‌కులు డిసైడ్ అయిపోయారు. అలాగే ఆయ‌న పాడిన అన్ని పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 1973లోనే `మాయ‌దారి మ‌ల్లిగాడు`లో కృష్ణ న‌వ్వును బాలు అవ‌పోస‌న ప‌ట్టారు. న‌టీన‌టులు ఎవ‌రైనా స‌రే వారి గాత్ర ధ‌ర్మాన్ని అనుస‌రించేవారు బాల‌గంద‌ర్శ‌కుడు. 76లో ~శ్రీ రాజేశ్వ‌రి విలాస్ కాఫీక్ల‌బ్‌`లో `నా దారి ఎడారి నా పేరు బికారీ.. `పాట‌ ఎంతో ఫేమ్ అయింది. కృష్ణ‌, ర‌జ‌నీకాంత్ న‌టించిన `అన్న‌ద‌మ్ముల స‌వాల్‌`లో `నాకోస‌మే నీవున్న‌ది, ఆకాశ‌మే ఔన‌న్న‌ది.. ది..ది.. అంటూ సాగే పాట‌ హైలైట్ అయింది. 
 
చిరంజీవికి 1978లో `ప్రాణం ఖ‌రీదు` సినిమాలో `యాత‌మేసి తోడినా.. అనే పాట‌లో జీవ‌న తాత్కిక‌త‌ను అద్దం ప‌ట్టారు. అదే చిరుతో `అభిలాష‌`లో `బంతి చామంతి.. అంటూ ఇళ‌య‌రాజా స్వ‌రంతో మ‌రో కొత్త సొగ‌సులు పొదిగారు. ఇక `ఛాలెంజ్‌`లో `ఇందువ‌ద‌న చంద‌వ‌ద‌న` అంటూ చంద‌నాలు దిద్దారు. అలాగే ప‌సివాడి ప్రాణం, గేంగ్‌లీడ‌ర్‌లో `భ్ర‌దాచ‌లం కొండ‌..` ఆ త‌ర్వాత `బంగారు కోడి పెట్ట‌..` 98లో చూడాల‌ని వుంది సినిమా, ఆ త‌ర్వాత ఇంద్ర సినిమాలో `ఘ‌ల్లు ఘ‌ల్లుమ‌ని సిరిమువ్వ‌ల చినుకేచేర‌గా..` ఆయ‌న గాత్ర వైవిధ్యానికి మ‌చ్చు తున‌క‌లు.
 
అదేవిధంగా నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌యాయాత్ర‌ల‌కు బాలు పాట‌లు ఎంతో తోడ్ప‌డ్డాయి. ఆయ‌న న‌టించిన వంద‌కి పైగా చిత్రాలో పాట‌లు ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రిచాయి. మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డులో `దంచ‌వే మేన‌త్త కూరురా.. ఆదిత్య 369లో జాన‌విలే మ‌ధుపాణివే.. అంటూ స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయ‌డు చిత్రాల‌లో `ల‌క్స్ పాప ల‌క్స్‌పాప` అంటూ హుషారెత్తించారు బాలు. అదే గాత్రం పాండురంగ‌డులో `మాత్రుదేవోభ‌వ‌.. తారాస్థాయి గీతం అది. శ్రీ‌రామ‌రాజ్యంలో `జ‌గ‌దానంద‌కార‌కా జ‌య జాయ‌కి ప్రాణ నాయ‌కా శుభ స్వాగ‌తం అంటూ ఆక‌ట్టుకున్నారు.
 
ఇలా అనేక విజ‌య‌వంత‌మైన గీతాల‌తో ప్రేక్ష‌కుల‌పై ప‌న్నీరు జ‌ల్లిన బాలు కె.విశ్వ‌నాథ్ చిత్రాల‌కు బ్రాండ్‌గా నిలిచారు. 88లో స్వ‌ర్ణ‌క‌మ‌లంలో.. కొత్త‌గా రెక్క‌లొచ్చ‌నా.. అంటూ. వెంక‌టేష్‌కు పాడారు. అలా `ప్రేమ‌` సినిమాలో ప్రియ‌త‌మా.. నా హృద‌య‌మా.. అన్నారు. ధృవ‌న‌క్ష‌త్రం, బొబ్బిలిరాజా సినిమాలు మ‌రో ప్ర‌త్యేక‌త‌లు.
 
విశ్వ‌నాథ్ చిత్రాల‌కు బాలు గాత్ర‌మే ప్రాణం. సంగీత‌భ‌రిత చిత్రాలు క‌నుక ఆయ‌న పాట మ‌ధురంగా వుండేవి. శంక‌రాభ‌ర‌ణంలో జె.వి.సోమ‌యాజులు భ‌గ‌వంతునికి ఆవేద‌న‌తో నివేదించిన పాట‌కు మ‌హ‌దేవన్‌, పుళందే వారు ఇచ్చిన ప్రోత్సాహంతో బాలు చెల‌రేగిపోయారు. ఇలా ఎన్నో పాట‌లు ఆయ‌న గాత్రం నుంచి జాలువారాయి. మ‌మ్ముట్టిపై `శివానీ.. అంటూ పాడిన పాట సినిమాకే ప్రాణం.
 
ఇన్ని చేసిన ఆయ‌న ఎంద‌రో కొత్త‌త‌రానికీ బాట వేశారు. రామోజీరావుగారి ఆలోచ‌న‌లోంచి పుట్టిన స్వ‌రాభిషేకం, పాడుతాతీయ‌గా వంటి కార్య‌క్ర‌మాల‌కు న్యాయ‌నిర్ణేత‌గా వుంటూ బాలు చేసిన విశ్లేష‌ణ‌లు, మాట‌లు, మెరుపుల‌కు, తీర్పుకు ప్రేక్ష‌కులు  మంత్ర‌ముగ్గ‌ల‌య్యేవారు. ఒక‌ద‌శ‌లో గాన‌గంధర్వులే ఆయ‌న్ను ఆవ‌హించార‌నిపిస్తుంది. అలా ఎంద‌రినో చైత‌న్య‌వంతుల్ని చేసిన బాలు అనుకోకుండా `అంత‌ర్యామి అల‌సి తీ సొల‌సి తీ` అంటూ సుదూర తీరాల‌కు వెళ్ళిపోయారు. అయినా ఆయ‌న గాత్ర మాధుర్యం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం. ఇదే ఆయ‌న‌కు నివాళి.