అంటే సుందరానికీ సక్సెస్ జోష్‌లో చిత్ర యూనిట్
ante Sundarani Success Josh
నాని నటించిన అంటే సుందరానికీ చిత్రం శుక్రవారమే విడుదలైంది. ఈ చిత్రం అన్నిచోట్ల మంచి టాక్‌తో రన్ అవుతుందని నిర్మాతలు మైత్రీమూవీస్ అధినేతలు తమ కార్యాలయంలో టాపాసులు కాల్చారు. ఈ సందర్భంగా చిత్రంలో పనిచేసిన టీమ్ హాజరైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ గారికి, రవి గారికి ధన్యవాదాలు తెలిపారు నాని. నిన్నరాత్రి పవన్ కళ్యాణ్‌గారు మాట్లాడిన మాటలు చాలామందికి రీచ్ అయ్యాయనీ నాని అన్నారు. సినిమాకి వెన్నెముక లాంటి దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు. నరేష్, రోహిణి, నదియా, . ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక విభాగం అంతటికీ నా అభినందనలు. మంచి సంగీతం అందించిన వివేక్ సాగర్ కి అభినందనలు తెలిపారు.