మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:10 IST)

మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య"కు శుభవార్త (Video)

Acharya poster
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన చిత్రం "ఆచార్య". ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై నిర్మించారు. ఈ చిత్ర నిర్మాతలు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పి. తొలి పది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆట (ఐదో) ఆటకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఏపీ ప్రభుత్వం కూడా తొలి పది రోజుల వరకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ టిక్కెట్ ధర కూడా రూ.50 వరకు పెంచుకోవచ్చు. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్ చిత్రాలకు తొలి పది రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు కొరటాల శివ వంటి సక్సెస్‌ఫుల్ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.