సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (21:55 IST)

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఈ సినిమా నిర్మాత‌లు ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. నిజానికి అది 'య‌మ‌లీల' చిత్రంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన సూప‌ర్ హిట్ సాంగ్ 'జుంబారే'కు రీమిక్స్‌.
 
లెజండ‌రీ అయిన తాత‌య్య‌ను ఆ పాట‌లో అశోక్ గ‌ల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆక‌ట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్.. పాట‌కు స‌రిగ్గా స‌రిపోయాయి. ఆ పాట‌లో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సైతం మెర‌వ‌డంతో ఈ ప్ర‌త్యేక‌మైన రోజు సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు ప‌ర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది.
 
ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ 50 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.