శుక్రవారం, 31 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2025 (13:43 IST)

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Avika Gor at Ugly Story shooting set
Avika Gor at Ugly Story shooting set
నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అగ్లీ స్టోరీ. రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేయగా శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. శ్రీకాంత్ పట్నాయక్, మిథున్ సోమ ఎడిటింగ్ చేశారు.
 
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రం నవంబర్ 21వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో రానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
 
అవికాగోర్ మాట్లాడుతూ, థ్రిల్లర్ అంశాలతో మొదటిసారి ఇటువంటి సినిమా చేస్తున్నాను. ఇది నా కెరీర్ లో మరో మైలురాయిలా వుంటుందని తెలిపారు.