శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 18 అక్టోబరు 2021 (22:13 IST)

పూనకం వచ్చినట్లు ఊగిపోకండి: బాబూమోహన్ సెటైర్లు

ప్రకాష్ రాజ్ ప్యానల్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు నటుడు బాబు మోహన్. తిరుపతిలోని విద్యానికేతన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడారు.
 
మా అసోసియేషన్‌కు నవయువకుడు వచ్చాడన్నారు నటుడు బాబూమోహన్. విష్ణుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోయామన్న బాధ, ఆవేశంతో అడ్డు తగలవద్దన్నారు. పూనకం వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారన్నారు.
 
హైస్కూల్ చదువులతో కనీస విజ్ఞానం లేని వ్యక్తులు ఉన్నత విద్య అభ్యసించిన విష్ణును విమర్సించడం హాస్యాస్పదన్నారు. మరో రెండుసార్లు విష్ణునే మా అధ్యక్షుడిగా ఎన్నికవుతాడన్నారు.