శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (13:41 IST)

#BalegaTagilaveyBangaram పాట రిలీజ్ (Video)

raviteja
మాస్ మహరాజ్ రవితేజ, శ్రుతి హాసన్ జంటగా చేస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ వాస్తవ సంఘటల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇందులో రవితేజ పవరు ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల విశేష స్పందన అందుకున్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి బలే తగిలావే బంగారం పాట టీజర్‌ను విడుదల చేశారు.
 
తాజాగా ఈ సినిమాలోని పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా, అనిరుధు ఓకల్స్ ఇచ్చాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. అయితే 'ఆకారం చూస్తే అబ్బబ్బో.. అవతారం చూస్తే అబ్బబ్బో..అదిరే అలంకారం చూస్తే అబ్బబ్బో అంటూ ఈ పాటకు అనిరుధ్ స్వరపరిచాడు. ఈ పాట యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.