1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bhanupriya Reveals Suffering From Memory Loss Since Two Years, Says 'Can't Memorize Dialogues

మతిమరుపుతో బాధపడుతున్నా...: నటి భానుప్రియ

bhanupriya
తనకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని సీనియర్ హీరోయిన్ భానుప్రియ అన్నారు. అంటే ఒక విధంగా తాను మతిమరుపుతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. తాజాగా ఆమె ఓ వెబ్‌సైట్‌కు ప్రత్యక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలపై ఆమె స్పందించారు. 
 
ఇటీవల "నాట్యం" అనే సినిమాను చేశాను. నా పాత్ర చాలా బాగుంటుందనీ, కథలా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని చెప్పారు. అయితే, అందులో అంత సత్తా లేదనే విషయం నాకు షూటింగు సమయంలో తెలిసింది. ఇపుడు మాట్లాడితే గొడవలు అవుతాయని తానేమీ మాట్లాడలేదన్నారు. 
 
ఈ సినిమా చూసిన తర్వాత తాను ఎందుకు ఇలాంటి పాత్రను చేశావు.. ఇలాంటి పాత్రలు చేయకండి అని అనేక మంది తనకు ఫోన్ చేసి సందేశాలు పెట్టారు. ఇక అప్పటి నుంచి నా పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే కొత్త చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి పాత్రలు వస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో ఈ మధ్యకాలంలో కాస్త మతిమరుపు ఎక్కువైంది. ఏదైను ఒకటి చేయాలని అనుకున్నా.. ఒక వస్తువు ఒక చోట పెట్టిన తిరిగి గుర్తుకు రావడం లేదన్నారు. జ్ఞాపకశక్తి తగ్గిందని చెప్పాలి అని నటి భానుప్రియ చెప్పారు. ఈ సమస్య గత రెండేళ్లుగా ఉందని తెలిపారు.
తర్వాతి కథనం
మహేష్ బాబు హీరోయిన్‌‌కు పెళ్లి : వరుడు ఎవరంటే...