ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (20:28 IST)

భీమన అమావాస్య... భర్తకు పాదపూజ చేసిన ప్రణీత...

Pranitha
Pranitha
భర్త యందు భార్య తన భక్తి ప్రపత్తులు, ప్రేమాభిమానాలు చాటుకునే పర్వదినంగా భీమన అమావాస్యకు పేరుంది. పూర్వం ఓ యువతి తన విధిరాతను అంగీకరిస్తూ మృతుడైన యువరాజును పెళ్లాడుతుంది. 
 
మరుసటిరోజున ఆమె మట్టి ప్రమిదలతో పూజచేసి శివపార్వతుల కరుణాకటాక్షాలు సంపాదిస్తుంది. శివపార్వతులు ప్రత్యక్షమై ఆమె భర్తను బతికిస్తారు. భీమన అమావాస్య వెనకున్న గాథ ఇది. 
 
అలాంటి ఆషాఢ మాసంలో వచ్చే ఈ భీమన అమావాస్యను నేడు (జులై 28) భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తాజాగా, ప్రముఖ నటి ప్రణీత కూడా ఈ పండుగను ఆచరించారు. 
 
ఆమె తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేశారు. భర్త నుంచి ఆశీస్సులు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.