బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (08:58 IST)

బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఈ వారం డేంజర్ జోన్‌లో ఇనయా, సుదీప?

Bigg boss
బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేదానిపై మూడు నాలుగు రోజుల ముందు నుంచే వైరల్ అవుతూ వస్తుంది. ఇంటి నుంచి ఎవరు బయటకు వస్తారనేది ముందుగానే తెలిసిపోతుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో రేవంత్, గీతూ, శ్రీహాన్, బాలాదిత్య, చంటి లాంటి వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. 
 
ఇప్పట్లో వీళ్ళు బయటికి వచ్చే ఛాన్స్ లేదు. మిగిలిన వాళ్ళలో కూడా నేహా అందరికంటే ముందుంది. వీళ్లు కాకుండా ఈ వారం వాసంతి, ఇనయా సుల్తానా, ఆరోహి, సుదీప నామినేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ నలుగురులో వాసంతికి అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత ఆరోహి ఉంది.
 
అంటే ఈ వారం డేంజర్ జోన్‌లో ఇనయా, సుదీప ఉన్నారు. ఇంట్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ.. వంట చేస్తూ టాస్క్ లోను పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుదీప.. ఇప్పట్లో ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టమే. దాంతో ఎటువైపు నుంచి చూసుకున్న ఈ వారం ఇనాయా ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.