ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (19:08 IST)

నాగార్జున, సోనాల్ చౌహాన్ ది ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వేగం వ‌చ్చేసింది

Nagarjuna and Sonal Chauhan
Nagarjuna and Sonal Chauhan
అక్కినేని నాగార్జున,  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాట ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. అంచనాలను భారీగా పెంచిన థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే క్యూరీయాసిటీని పెంచింది.
 
ముందుగా చెప్పినట్లే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ఎలిగెంట్ గా ప్రజంట్ చేసింది. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలసి తమ లవ్లీ టైమ్ ని చాలా ఉల్లాసంగా గపడం చాలా ప్లజంట్ గా ప్రజంట్ చేశారు. నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించగా, సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. వారి రొమాంటిక్ కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.
 
భరత్, సౌరబ్ ద్వయం రొమాంటిక్ ఫీల్‌తో కూడిన ఒక లవ్లీ ట్యూన్ ని స్కోర్ చేశారు.  కపిల్ కపిలన్  రమ్య బెహరా పాటని మరింత ఆహ్లాదంగా ప్రజంట్ చేశారు. కృష్ణ మాదినేని సాహిత్యం ఆకట్టుకుంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు ఈ పాట సరైన ఆరంభాన్ని ఇచ్చింది.
 
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
 
 ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
 
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.
 
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం- దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు,  నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్,  సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.,  సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల