1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (15:29 IST)

ఆగిపోయిన 'బిగ్‌బాస్ నాన్ స్టాప్' షో.. కారణం ఏంటంటే?

డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ప్రారంభమైంది. ఓటీటీలో ఈ షోకు మంచి డిమాండ్ ఏర్పడింది. మొదటి వారంలోనే హౌజ్‌లో గొడవలు, టీంలు, నామినేషన్లతో సాగిపోతుంది బిగ్‌బాస్‌. 
 
అయితే ఇలా ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అప్పుడప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోతుంది. ప్రేక్షకులు, సబ్‌స్క్రైబర్ల నుంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి.
 
తాజాగా నిన్న రాత్రి నుంచి బిగ్‌బాస్‌ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆగిపోయింది. దీంతో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి కొంచెం సమయం పట్టేలా వుంది. 
 
అందుకే నిన్న అర్ధరాత్రి నుంచి బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది. లైవ్ స్ట్రీమింగ్ ఆపేసి ఆ స్థానంలో పాత ఎపిసోడ్స్‌ని టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్‌ అభిమానులు, ప్రేక్షకులు, సబ్‌స్క్రైబర్లు నిరాశ చెందుతున్నారు.