శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి ఛిఛిలి
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:14 IST)

యాంకర్ శ్రీముఖిని బిత్తిరి అంత మాటన్నాడా..?

దిక్సూచి సినిమా ఆడియో ఫంక్షన్‌కు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించారు. ఆ సందర్భంలో బిత్తిరి సత్తిని ఎంతో ప్రేమగా పాలకూర స్టార్ అంటూ స్టేజ్‌పైకి ఆహ్వానించింది. దిక్సూచి సినిమాలో సత్తి పాట పాడటంతో పాటుగా క్రూషియల్ రోల్ కూడా చేసారు. సత్తి స్టేజ్‌పైకి రాగానే శ్రీముఖి డ్రెస్సింగ్‌ను ఉద్దేశించి పద్ధతి, సాంప్రదాయం గల దుస్తుల్లోకి రాలేవు, రావు అనగా దానికి ధీటుగా మరిదేంటి సాంప్రదాయం కాక పప్పుచారన్నమా అని కౌంటర్ వేసింది. 
 
వెంటనే సత్తి దీనిని కుట్టిన టైలర్‌ను అనాలి, పైభాగంలో ఇదేంటి చిరిగినట్లు, దీంతో ఏమి కుట్టించుకున్నాడు అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయగా, మీరు కింద భాగమంతా వదిలేసి, దీన్నే ఎందుకు చూస్తున్నారు, మీరిలా చూడటానికే మేము వేసుకున్నామని బదులివ్వగా తెల్ల కాగితంపై మచ్చ ఉంటే ఈ మిగతా తెల్ల భాగాన్నంతా వదిలేసి ఎవరైనా మచ్చనే చూస్తారని సమర్ధించుకున్నాడు. స్త్రీల దుస్తులపై కామెంట్స్ పాస్ చేసినవారి జాబితాలో సత్తి కూడా చేరిపోయారు.